
ప్రజాశక్తి - ఉండి
మండలంలోని మహదేవ పట్నంలో ఉన్న సన్‌రైజ్ ఫౌండేషన్ వయోవృద్ధుల ఆశ్రమంలో కృష్ణంరాజు ప్రథమ వర్థంతి కార్యక్ర మం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు ఫాన్స్ అసోసియేషన్ నాయకులు గాదిరాజు వెంకటేశ్వరరాజు, పివి.రామరాజు మాట్లాడారు. వయోవృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు రంగరాజు, యర్రా విక్రమ్, అడబాల శివ, వేగేశ్న అనంతలక్ష్మి, పెన్మెత్స రంగప్రసాద్‌రాజు, కేంద్రం నిర్వాహకులు సైపరాజు వాణి, ఉప్పల పాటి ఇందిర పాల్గొన్నారు.