Sep 17,2023 00:53

ప్రజాశక్తి - పంగులూరు
మండలంలోని బూదవాడ జెడ్‌పి ఉన్నత పాఠశాలలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వాలీబాల్ జట్ల జట్టు ఎంపిక శనివారం జరిగింది. ఎంపిక పోటీలకు జిల్లావ్యాప్తంగా 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. విద్యార్థుల క్రీడా ప్రతిభా ఆధారంగా ఎంపిక జరిగినట్లు పాఠశాల హెచ్‌ఎం బంగారు కొండ తెలిపారు. అండర్ 14, అండర్ 17 విభాగాలలో బాల, బాలికలకు చెందిన నాలుగు జట్ల ఎంపిక జరిగినట్లు ఎస్‌ఏపిఈ అసోసియేషన్ సెక్రెటరీ నత్తన  కృష్ణ, సభ్యులు వేణుగోపాల్, వెంకట్రావు తెలిపారు. క్రీడాకారుల ఎంపికను పిడిలు స్వరూపరాణి, శేషగిరి, రమేష్, సుబ్బలక్ష్మి, వెంకటరావులు చేశారని తెలిపారు. ఒక్కో జట్టుకు 16మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు తెలిపారు.