
ప్రజాశక్తి - పంగులూరు
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఖోఖో జట్ల ఎంపిక శుక్రవారం పంగులూరులోని మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలలో అండర్- 17, అండర్ -14 , అండర్- 19 విభాగాలలో జిల్లా నలుమూలల నుంచి సుమారు 400మందికిపైగా విద్యార్థులు సెలక్షన్స్ కు హాజరయ్యారు. అండర్- 17 క్రీడాకారులను జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ కె వనజ, రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారామరెడ్డి, జిల్లా కార్యదర్శి బి కాశీవిశ్వనాథరెడ్డి, ట్రెజరర్ హనుమంతరావు, పిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రీడాకారులను ఎంపిక చేశారు. కార్యక్రమానికి ముందు జరిగిన సమావేశంలో వైసీపీ నాయకులు, మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాయిని వెంకట సుబ్బారావు మాట్లాడారు. మూడు దశాబ్దాలపైగా ఖో ఖో క్రీడలకు ఆదిత్యం ఇస్తూ వస్తుందని అన్నారు. ఎంతోమంది జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఆడి సామర్థ్యాలను సాటుకున్నారని అన్నారు. ఎంపికుకు వచ్చిన క్రీడాకారులకు భోజన వసతిని పంగులూరు గ్రామ పెద్దలు, ఎస్‌ఆర్‌ఆర్ ఖో ఖో అకాడమీ కల్పిస్తుందని మేకల సీతారామిరెడ్డి తెలిపారు. అండర్ -19 విభాగంలో బాలుర ఖోఖో జట్టు ఎంపికను జూనియర్ కళాశాల స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఆదినారాయణ, రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారామరెడ్డి ఎంపిక చేశారు. అండర్ -18 విభాగంలో బాలుర జట్టును ప్రకాశం జిల్లా ఖోఖో కార్యదర్శి బి కాశీవిశ్వనాథరెడ్డి, ట్రెజరర్ హనుమంతరావు, శ్రీనివాసరెడ్డి ఎంపిక చేశారు. ఎంపిక చేసిన అండర్ 18 జట్టు చిత్తూరులో అక్టోబర్ 20నుండి 22వరకు జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటారని సీతారామరెడ్డి తెలిపారు.