Jul 31,2023 20:29

మిట్స్‌లో పరిశోధనలపై చర్చిస్తున్న జపాన్‌ ప్రొఫెసర్‌లు

కురబలకోట : స్థానిక మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో జపాన్‌లోని చిబా యూనివర్శిటీ ఆఫ్‌ కామర్స్‌ నుంచి ప్రొఫెసర్‌ యుకారి షిరోటా, గకుషుయిన్‌ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్‌ టెట్సుజీ కుబోయామా, ప్రొఫెసర్‌ టకాకో హషిమోటోలు మూడురోజుల పాటు కళాశాలను సందర్శిస్తారని ప్రిన్సిపల్‌ యువరాజ్‌ పేర్కొన్నారు. వీరు కళాశాలలో గల స్కూల్‌ అఫ్‌ మేనేజిమెంట్‌, స్కూల్‌ అఫ్‌ కంప్యూటరింగ్‌ రంగాలైన ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌ రంగాలలో ఉమ్మడి పరిశోదనలకు కషిచేస్తారని తెలిపారు. అకడమిక్‌ ఎక్సలెన్స్‌, ఇన్నోవేషన్‌లలో విద్యార్థులను, అధ్యాపకులను ప్రోత్సహించడానికి ఇది ఒక మంచి అవకాశమని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ బసాబి చక్రబర్తి, కో- ఆర్డినేటర్‌ యు.విజయలక్ష్మి, బి.శ్రీకాంత్‌ పాల్గొన్నారు.