Nov 11,2023 19:23

సమస్యలు తెలుసుకుంటున్న మీనాక్షి నాయుడు

ప్రజాశక్తి - ఆదోనిరూరల్‌
గత టిడిపి ప్రభుత్వంలో ఉన్న సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగిస్తూ జనసేన, టిడిపి ఉమ్మడి మేనిఫెస్టోను అమలు చేస్తామని టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు తెలిపారు. శనివారం ఆదోని మండలం బసాపురం గ్రామంలో 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి టిడిపి అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకే రంగులు మారుస్తూ ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. టిడిపి అధినేత చంద్రబాబును కక్షతో అరెస్టు చేయించి జగన్‌ శునకానందం పొందారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు పన్నినా 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టిడిపి సీనియర్‌ నాయకులు బసాపురం రామస్వామి, సత్తన్న, శివరుద్రయ్య, పరశురాం, రమణ, రంగన్న, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌ చౌదరి పాల్గొన్నారు.