ప్రజాశక్తి - నగరం
శబ్ద కాలుష్యంలో కూడా స్పష్టంగా మాట్లాడగలిగేందుకు వినియోగించు కోదగిన ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరుపై విశ్లేషణ అనే అంశముపై మండలంలోని ఈదుపల్లి గ్రామానికి చెందిన చింతల వెంకట ధనుంజయ ఉమా శంకర్ పరిశోధన వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధన పత్రానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పిహెచ్‌డి డాక్టరేట్ పట్టాను మంజూరు చేసింది. యూనివర్శిటీ ఆవరణలోని డైక్‌మెన్ ఆడిటోరియంలో జరిగిన 39, 40స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్ ఆచార్య హేమచంద్రారెడ్డి, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి రాజశేఖర్ చేతులమీదుగా పిహెచ్‌డి పట్టాను ఉమాశంకర్‌కు అందజేశారు. ఉమాశంకర్ తండ్రి చింతల వెంకట శేషసాయి ప్రసాద్ గతంలో జాతీయ అవర్డు అందుకున్నారు.










