వేలల్లో తరలివచ్చిన ఔత్సాహిక రన్నర్లు
నాలుగు విభాగాల్లో పోటీలు నిర్వహణ
ప్రజాశక్తి- సీతమ్మధార : ప్లాస్టిక్, మత్తు పదార్ధాల వల్ల కలిగే దుష్ప్రయోజనాలను వివరిస్తూ నగర ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సంధ్యా మెరైన్స్ సాగరతీరంలో నిర్వహించిన వైజాగ్ మారథాన్ ఉల్లాసభరిత వాతావరణంగా సాగింది. 21కె, 10కె, 5కె, 3కె నాలుగు విభాగాల్లో నిర్వహించిన మారథాన్‌లో నగరవాసులతో పాటు దేశం నలుమూలల నుంచి వయోభేదం లేకుండా తరలివచ్చిన వేలాదిమంది ఔత్సాహికులు పాల్గొన్నారు. మారథాన్ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టగా, వాలంటీర్లను, తక్షణ వైద్య సేవల కోసం వైద్యులు, అంబులెన్స్‌లను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. వైజాగ్ రన్నర్స్ సొసైటీ తొలిసారి నిర్వహించిన మారథాన్‌కు భారీ స్పందన రావడంపై సొసైటీ ప్రెసిడెంట్ బాలకృష్ణ రారు హర్షం వెలిబుచ్చారు.










