కలర్స్‌డేలో చిన్నారులతో ప్రిన్సిపల్ విజయలక్ష్మి
ప్రజాశక్తి -పిఎం పాలెం :కొమ్మాది సమీపంలోని విజయం స్కూల్ ఆవరణలో శుక్రవారం ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నేషనల్ కలర్స్ డే నిర్వహించారు. ఆకర్షనీయమైన వేదికలో, విభిన్న వేషధారణలో 300 మంది చిన్నారుల పలు నృత్యప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి. విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు విద్యార్థులు, పాఠశాల సిబ్బంది వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలిపేలా చిన్నారుల సాంస్కతిక ప్రదర్శన సందేశాత్మకంగానూ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.










