Jul 31,2023 20:39

'ఉక్కు'పై కేంద్రం వైఖరి సరికాదు : ఎస్‌ఎఫ్‌ఐ

 జమ్మలమడుగు  : కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ సోమవారం సిపిఎం జిల్లా కమిటీ అధ్వ ర్యంలో కలెక్టరేట్‌ వద్ద జరిగే మహాధర్నాలో సిపిఎం అనుబంధ సంఘాల్లో భాగంగా సోమవారం స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయ ఇన్‌ఛార్జి ఎఒ నిజాముద్దీన్‌కు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి వియన్‌కుమార్‌ వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిం దన్నారు. విభజన హామీల్లో ప్రధానమైన కడప ఉక్కును విస్మరించడం శోచనీ యమన్నారు. 9ఏళ్ల తర్వాత కడప ఉక్కు సాధ్యం కాదని చావుకబురు చల్లగా చెప్పడం దారుణమన్నారు. దీన్ని వ్యతిరేకించని మన రాష్ట్ర ఎంపీల మౌనానికి ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చిత్తశుద్ధి లేదన్నారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి పట్టణ కార్యదర్శి దాసరి విజరు, రాజు అబ్రహం, నరేంద్ర, నాగన్న , మన్సూర్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజా, పుష్పరాజ్‌, సురేంద్ర, సుబహన్‌ పాల్గొన్నారు.