ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కనగరం సెక్టర్- 2 ఓల్డ్ హెల్త్ సెంటర్ కాంప్లెక్స్‌లో ఉక్కు ఒబిసి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన భవనాన్ని స్టీల్‌ప్లాంట్ సిఎమ్‌డి అతుల్ భట్ ప్రారంభించారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఎమ్‌డి మాట్లాడుతూ, ఒబిసి ఉద్యోగుల రిజర్వేషన్లు ఉక్కు కర్మాగారంలో అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉక్కు డైరెక్టర్లు వేణుగోపాలరావు, ఎకె.సక్సేనా, సిజిఎం కె.శ్రీనివాసశర్మ, చంద్రశేఖర్, మధుసూదనరావు, కార్మిక సంఘాల నాయకులు, ఒబిసి ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులు, కోమటి రవిశంకర్, నక్క వెంకటరమణ, నెల్లి అప్పలరాజు, కొణతాల శ్రీనివాస్, పిల్లి చంద్రరావు, నమ్మి తాతారావు పాల్గొన్నారు.










