Aug 18,2023 21:33

సదస్సులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌

కడప అర్బన్‌  : ఉక్కు పరిశ్రమ సాధనకు యువతకు పోరాటమే ఏకైక మార్గమని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ అన్నారు. శుక్రవారం యుటిఎఫ్‌ భవన్‌లో డిఐఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప ఉక్కు సాధనకై 'రాష్ట్రస్థాయి సదస్సు' జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. సదస్సుకు రాయలసీమ అభివద్ధి వేదిక కన్వీనర్‌, పశ్చిమ రాయలసీమ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, కడప ఉక్కు సాధనా కమిటీ జిల్లా కన్వీనర్‌ బి.నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గేయానంద్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కావాల్సిన ఇనుప ఖనిజం, సున్నపురాయి, నిఖేల్‌, డోలమైట్‌ తదితర మూలకాలు విస్తతంగా దొరుకుతున్నాయన్నారు. విద్యుత్తు ఆర్టీపీపీ నుంచి, నీరు మైలవరం, గండికోట, బ్రహ్మ సాగర్‌ నుంచి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, ముద్దనూరు రైలు మార్గం ద్వారా, కష్ణపట్నం నుంచి ఓడ మార్గం రవాణా సౌకర్యం ఉందని తెలిపారు. 2010లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జిల్లాలో బ్రాహ్మిణి స్టీల్‌ కు శంకుస్థాపన చేసి, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించాలని తలపెట్టారన్నారు. ఆయన మర ణించడం, రాష్ట్రం విభజన జరగడం, ప్రభు త్వాలు మారడంతో బ్రాహ్మిణి స్టీల్‌ రూ.1050 కోట్లు ఖర్చుపెట్టి తరువాత చేతులెత్తేశారని పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో కడప ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వ ఉక్కు పరిశ్రమల నిర్మాణ సంస్థ సెయిల్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తామని పార్లమెంటు సాక్షిగా, రాష్ట్రపతి ఆమోదంతో రాతపూర్వకంగా చట్టంలో పొందుపరిచారన్నారు. అప్పట్లో పాలక, ప్రతిపక్షాలు ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. కరువు తీవ్రంగా ఉన్న ప్రాంతం రాయలసీమలో ప్రభుత్వ రంగ భారీ పరిశ్రమ ఒకటీ లేదని, ఈ ప్రాంత అభివద్ధికి కడప ఉక్కు పరిశ్రమ ప్రాణ వాయువు లాంటిదని చెప్పారు. బిజెపి రాష్ట్ర నాయ కులు కర్నూల్‌లో రాయలసీమ డిక్లరేషన్‌ పేరిట కడప ఉక్కు నిర్మిస్తామని ప్రకటించారని, అదే బిజెపి పెద్దలు ఢిల్లీలో పార్లమెంటులో కడప ఉక్కు సాధ్యం కాదని మోసం చేశారన్నారు. సెయిల్‌ చైర్మన్‌ కడప జిల్లాకు వచ్చి 'పబ్లిక్‌ హియరింగ్‌' నిర్వహించాలని అప్పుడే నిజాలు వెళ్లడవుతాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లూస్‌ థింకింగ్‌ చేస్తున్నాయని వాపోయారు. బిజెపి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాలు లేవని తప్పుడు రిపోర్ట్‌ తెప్పించుకుని కడప ఉక్కు నిర్మించకుండా తప్పించు కుం టుం దన్నారు. సదస్సులో జిల్లా అధ్యక్షులు ముడ ియం చిన్ని, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునీల్‌, రాజేంద్ర, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్‌, రెబ్బా నరసింహులు, నగర అధ్యక్ష, కార్య దర్శులు షాకీర్‌, డి.ఎం.ఓబులేసు, జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్‌, నాయకులు షరీఫ్‌, మస్తాన్‌, ఆంజ నేయులు, సురేంద్ర, పుల్లయ్య, సురేష్‌ పాల్గొన్నారు.