
ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం
విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 5న కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్ గేట్ వద్ద జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పలు చోట్ల వాల్ పోస్టర్లను సిపిఎం నాయకులు ఆవిష్కరించారు.
కె.కోటపాడు : మండలంలోని సూరెడ్డిపాలెం గ్రామంలో ఉక్కు బహిరంగ పోస్టర్‌ను సిపిఎం నాయకులు గండి నాయనబాబు, ఎర్ర దేవుడు ఆధ్వర్యాన ఆవిష్కరించారు. ఉక్కు పరిరక్షణ బహిరంగ సభకు తరలిరావాలని ఎ.కోడూరు, వారాడ, ఆర్‌వై.అగ్రహారం, సింగన్నదొరపాలెం, గవరపాలెం, పిండ్రంగి, దాలివలస గ్రామాలలో ప్రచారం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వత్తాసు పలకడం దారుణమని నాయకులు విమర్శించారు. పార్టీ సానుభూతిపరులు సతీష్, పైడునాయుడు, నరసింహామూర్తి. దేవుడు నాయుడు పాల్గొన్నారు.
పరవాడ : మండలం కేంద్రం పరవాడలో చలో స్టీల్‌ప్లాంట్ బహిరంగ సభ గోడ పత్రికను విడుదల చేశారు. బంగారు బాతు లాంటి స్టీట్‌ప్లాంట్‌ను కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అమ్మడానికి పెట్టడం దారుణమని నాయకులు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ రక్షణ ఉద్యమం ప్రారంభించిన నాటి నుండి సిపిఎం ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వివి.రమణ, గనిశెట్టి సత్యనారాయణ, అనకాపల్లి నాగేశ్వరరావు, ఎ.బంగారు రాజు, ఎ.రాంబాబు, పెండ్యాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సబ్బవరం : స్థానిక దుర్గమాంబ ముఠా కళాసీ సంఘ కార్యాలయ ఆవరణలో చలో స్టీల్‌ప్లాంట్ బహిరంగ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఆర్.శంకరరావు, వివి.శ్రీనివాసరావు మాట్లాడుతూ నెల 5న బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉప్పాడ సత్యవతి, పప్పుల కోటేశ్వరరావు, కె.కోటేశ్వరరావు, యర్రా సోంబాబు, సోము నాయుడు, వంకర చిన్ని కష్ణ,సోమేష్ పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్ : నర్సీపట్నంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అడిగర్ల రాజు ఆదివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సంవత్సర కాలంగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. తెలుగు ప్రజలు పోరాడి సాదించుకున్న స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు విద్యార్థులు, యువజనులు, కార్మికులు కలిసిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.రమణ, అర్జున్ పాల్గొన్నారు.
పాయకరావుపేట : బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, నాయకులు బి.నాగేశ్వరరావు, ఎం.రాజేష్ గోడ పత్రికను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎం.అప్పలరాజు మాట్లాడుతూ, 32 మంది బలిదానం ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కును బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా అమ్ముతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై.రాజాబాబు, జీ.వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : ఉక్కు రక్షణ బైక్‌యాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 5న కూర్మన్నపాలెం స్టీల్‌పాంట్ ఆర్చి వద్ద నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు కోరారు. ఆదివారం 76వ వార్డు రామచంద్రనగర్‌లో రిక్షా కాలనీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వాల్‌పోస్ట్లర్లను ఆవిష్కరించారు. స్టీల్‌ప్లాంట్ వల్లే గాజువాక ప్రాంతం అభివృద్ధి చెందిందని, ఇపుడది ప్రయివేటు చేతుల్లోకి వెళితే అసంఘటితరంగ కార్మికులు బతుకు దుర్భరమౌతుందన్నారు.కార్యక్రమంలో గాజువాక జోన్ సిఐటియు అధ్యక్షులు డి.రమణ, రాజారావు, త్రినాధ, రామ్మూర్తి, రాము, లక్ష్మణరావు, చిన్నారావు, కార్మికులు పాల్గొన్నారు.
అగనంపూడిలో బైక్‌ర్యాలీ
ఉక్కునగరం : ఈనెల 5న సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఉక్కు రక్షణ బహిరంగసభను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం అగనంపూడిలో బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్‌ర్యాలీని 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, సీనియర్ నాయకులు సిహెచ్ నారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 20 నుంచి సిపిఎం ఆధ్వర్యంలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో సుమారు 1500 కిలోమీటర్లు ఉక్కు రక్షణ బైక్ యాత్ర జరిగిందని, దీనికి అడుగడుగునా విశేష స్పందన వచ్చిందని తెలిపారు. బైక్ యాత్ర ముగింపు సందర్భంగా 5న సాయంత్రం 4 గంటలకు కూర్మన్నపాలెం ఆర్చ్ నిర్వహించే బహిరంగసభలో సిపిఎం జాతీయప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని తెలిపారు. అగనంపూడిలో ఉన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు భారీ ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు నేత పి నీలకంఠం, ఉరిటి మరిడయ్య, చిత్త అబ్బాయి, పట్టా రమేష్, మంకోటి, ఉరిటి అప్పలరాజు, వంకర రాము, డి సత్యనారాయణ, శ్రీనివాసరావు శీరంశెట్టి, యలమంచిలి శ్రీనివాసరావు, కొయ్య సింహాద్రి,చట్టి నర్సింగరావు, గణేష్, గెద్దాడ రమేష్ , ఆంజనేయులు, చట్టీ అంజి, మంచాల కన్నారావు, డి అర్జున్, శనివాడ అప్పారావు, పట్టా నర్సింగరావు, చట్టి నూకరాజు, శివ పాల్గొన్నారు.