Jul 29,2023 20:57

నిరసన తెలియజేస్తున్న సిఐటియు నాయకులు

 ప్రొద్దుటూరు కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి. చంద్రశేఖర్‌ కోరారు. శనివారం సిఐ టియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వ హిం చారు. ఈసందర్బంగా ఆయన మాట్లా డుతూ స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం చేతుల ెత్తేసిందని, రాష్ట్రంలోని వైసిపి ప్రభు త్వం తామే నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకూ ఎలాంటి స్పందన లేదన్నారు. అధికారం లోకొ చ్చిన మూడు సంవత్సరాల్లో ఏర్పాటు చేస్తామని ఓట్లు వేయించు కున్నప్పటికీ దానిని పట్టించుకున్న పాపాన పోలే దని వాపోయారు. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పడితే దాదాపు యాభైవేల మందికి ఉపాధి దొరుకుం దని, జిల్లాలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని చెప్పా రు. ఇటీవల పార్లమెంట్‌ సమావేశా ల్లో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించడం తమ వల్ల కాదని కేంద్ర హోమ్‌శాఖ సహా య మంత్రి చెప్పినప్పటికీ రాష్ట్రంలోని వైసిపి, టిడిపి,జనసేన పార్టీలో ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలపై నోరు మెదపక రా ష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నా యన్నా రు. బిజెపికి మద్దతిస్తున్న పార్టీలను ఇంటికి సాగనంపాలన్నారు. కార్యక్ర మంలో సిఐటియు కార్యదర్శి విజయ కుమార్‌,మున్సిపల్‌ సంఘ కార్యదర్శి సాల్మన్‌, అధ్యక్షులు చంటి, గుర్రమ్మ, రాఘవ, సిఐటియు నాయ కులు బాల సుబ్బయ్య, ఓబులేసు, ఆటో యూ నియన్‌ నాయకులు రమేష్‌, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ముంతాజ్‌, వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు.