ప్రభుత్వాలు మారినా
ప్రజల ఉన్నతికి పాటుపడేదే
ప్రజాస్వామ్యం
నష్టం రాని వ్యాపారం లేదు
వీలైతే చేయూతగా మారి
గనులు అందించే మార్గం లేదు
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
గౌతులచ్చన్న, సంజీవయ్య ఇలా
ఎందరో చేసిన పోరాటం బలి దానమే
విశాఖ ఉక్కు అభ్యుదయం
లక్షల కోట్లను వేల కోట్లకు అమ్మేసి
ఎందరి ఆశలనో ఆశయాలనో
గాలికి వదిలేసే ప్రభుత్వమా మన దేశం?
మనకు నష్టం వచ్చినదాన్ని వాడుకొని
లాభాలు ఎలా సంపాదిస్తాడో
ఆలోచన లేదా వ్యాపారం మూసేసి
భూములు అమ్ముకు బతికేస్తాడు
ఆ మాత్రం తెలివి లేదా?
గద్దెను ఏలే ప్రజా ప్రతినిధులకు
రాజకీయ రంగు పులుముకున్న సంస్థలన్నీ
అన్యాక్రాంతం అయ్యాయి
ఎందరినో నిరాశ్రయులుగా మార్చాయి
ఊరుకుంటూ కూర్చుంటే పోస్కో
ఎగరేసుకు పోయే రేసులో ఉంది
ఉక్కు పిడికిలెత్తి పోరాడాలి సమైక్యంగా
అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు కార్మికులై
ఉక్కునగర వీధులు
సర్వమతం రంగలద్దుకున్న
రంగవల్లికలా ఉంటే..
ఏ కన్ను పడిందో కళావిహీనమైన
ఆంధ్ర మాతలా
బోరుమంటున్నాయి
ఉక్కువాసుల హృదయాల్లా...!!
* మాధురి కొలుకులూరి, ఎaఅఱ్‌తీఱఅa్‌ష్ట్రaతీajబ99ఏస్త్రఎaఱశ్రీ.షశీఎ