Dec 26,2022 23:49

అరుణ్‌కాంతిని సత్కరిస్తున్న ఒబిసి అసోసియేషన్‌

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కు కర్మాగారంలో డైరెక్టర్స్‌ (ప్రాజెక్ట్స్‌)గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన అరుణ్‌ కాంతి బగ్చీని ఛాంబర్‌లో కలిసిన ఒబిసి అసోసియేషన్‌ నాయకులు శాలువతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించేందుకు తమువంతు ప్రయత్నాలు చేయాలని అసోసియేషన్‌ నాయకులు ఆయనను కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అడహక్‌ అధ్యక్షులు కోమటి రవిశంకర్‌, ప్రధాన కార్యదర్శి నక్క వెంకటరమణ, నెల్లి అప్పలరాజు, కొణతాల శ్రీనివాసు, పిల్లి చంద్రరావు, చిన్నారావు, రాజమోహన్‌, విఎస్‌ఆర్‌ మూర్తి, గోవిందరాజు, పెంటారావు పాల్గొన్నారు.