Oct 04,2023 00:25

హెచ్‌పిసిఎల్‌ కల్యాణి గేటు వద్ద కార్మికులనుద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు

ప్రజాశక్తి-యంత్రాంగం
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యాన చేపట్టిన ఉక్కు రక్షణ యాత్ర ముగింపు సభకు ప్రజలు తరలిరావాలని కోరుతూ సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాలు, ఆటోజాతాలు నిర్వహించి చైతన్యం కల్పించారు.
గాజువాక :
గాజువాక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ, ఆంధ్రుల అశేష త్యాగాల ఫలితంగా ఏర్పడిన ప్లాంట్‌ను అమ్మడమంటే ఆంధ్రుల ఆత్మ గౌరవం దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ప్లాంట్‌ అమ్మాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని, పూర్తి స్థాయిలో నడిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కూర్మన్నపాలెంలో నిర్వహించే బహిరంగ సభకు సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొని ప్రసంగించనున్నారని తెలిపారు. ప్రజలు, కార్మికులు వారి కుటుంబాలతో సైతం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి మాట్లాడుతూ, మోడీ అండదండలతో ఒకవైపు అదాని, మరొకవైపు జిందాల్‌ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను, భూములు కాజేయాలని సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కుట్రలను తిప్పికొట్టడానికి ప్రతి కార్మికుని మద్దతూ అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం స్టీల్‌ డివిజన్‌ కార్యదర్శి పి.శ్రీనివాసరాజు, సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు, మాట్లాడారు.
బహిరంగసభను జయప్రదంచేయాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యాన షీలానగర్‌లో కరపత్రాలు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, జి.మణికుమారి, సునీత పాల్గొన్నారు.
ఉక్కునగరం : బహిరంగ సభను జయప్రదం చేయాలని విశాఖ ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యాన ఎస్‌ఎంఎస్‌ డిపార్ట్‌మెంట్‌లో సమావేశం నిర్వహించారు. కార్మికులందరూ హాజరుకావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పోరాట కమిటీ నాయకులు బి అప్పారావు, పివి రమణమూర్తి, రాజబాబు, తౌడన్న, కృష్ణమూర్తి, రమణ, కృష్ణ, విఎం.నాయుడు, ఎల్‌బి.నాయుడు, జిఎం.నాయుడు, కార్మికులు పాల్గొన్నారు.
సీతమ్మధార : బహిరంగ సభను జయప్రదంచేయాలని కోరుతూ అక్కయ్యపాలెం ఎఎస్‌ఆర్‌.నగర్‌లో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జోన్‌ కార్యదర్శి రాజు, అప్పలరాజు, సుందరమ్మ, లక్ష్మి, అప్పన్న పాల్గొన్నారు.
ములగాడ : హెచ్‌పిసిఎల్‌ కల్యాణ్‌ గేటు వద్ద సభ నిర్వహించారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గనాయుడు ప్రసంగించారు. కూర్మన్నపాలెంలో జరిగే బహిరంగసభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సభలో హెచ్‌పిసిఎల్‌ కాంటాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎం.కృష్ణారావు, సిపిఎం మల్కాపురం జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు, నాయకులు ఆర్‌.లక్ష్మణమూర్తి, కె.పెంటారావు, జి.నరేష్‌, డి.రాజేష్‌, ప్రేమ్‌ రాజు, నీలయ్య, హరి, దాసు, అచ్యుతరావు పాల్గొన్నారు.
భారీ బహిరంగసభను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం మల్కాపురం జోన్‌ కమిటీ ఆధ్వర్యాన ఆటో ప్రచారం నిర్వహించింది. విడిఆర్‌ ఐపిఎల్‌ చటర్జీ గొడౌన్స్‌ వద్ద ఆటో ప్రచారాన్ని సిపిఎం మల్కాపురం జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు ప్రారంభించారు. కంపెనీ గొడౌన్స్‌ ప్రాంతాలు, ఏడు వార్డుల్లోను ఆటో ప్రచారం నిర్వహిస్తున్నట్లు పైడిరాజు తెలిపారు. ఈ ప్రచారంలోముఠా కార్మిక సంఘం నాయుకులు కాటంరావు రాజబాబు, సన్యాసిరావు, అప్పలనాయుడు, పైడయ్య, ప్రజాట్యమండలి నాయుకులు వై.గంగాధర్‌, కె.శరత్‌, ఎ.జగదీష్‌ పాల్గొన్నారు.
ఆరిలోవ : సిపిఎం ఆరిలోవ జోన్‌ కమిటీ ఆధ్వర్యాన బాలాజీనగర్‌లో బహిరంగసభ, ప్రచార జాతా నిర్వహించారు. ఆటో జాతా ఆరిలోవలోని శ్రీకాంత్‌నగర్‌, అంబేద్కర్‌ కాలనీ, బిఎన్‌ఆర్‌ కాలనీ, బాలాజీనగర్‌, తోటగరువు, రవీంద్రనగర్‌, సుందర్‌నగర్‌, ఆదర్శనగర్‌ గ్రామ సంఘాలల్లో జాతా సాగింది. ఇంటింటికీ కరపత్రాలను నాయకులు పంపిణీ చేశారు. సంత వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్‌ కార్యదర్శి వి.నరేంద్రకుమార్‌, నాయకులు పి.శంకర్‌, లక్ష్మి, కుమారి, సూర్యనారాయణ, నూర్జహాన్‌, సన్యాసమ్మ పాల్గొన్నారు.
ఎంవిపి.కాలనీ : సిపిఎం మద్దిలపాలెం జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రచార జాతాను పిఠాపురం కాలనీ మార్కెట్‌ వద్ద పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ ప్రారంభించారు. మోడీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు చేస్తున్న కుట్రలను వివరిస్తూ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆటో జాతా మద్దిలపాలెం, సీతమ్మధార, హెచ్‌బి.కాలనీ, సింహాద్రిపురం, వెంకోజీపాలెం, ఎంవిపి కాలనీ, జాలారిపేట, శివాజీపాలెం ప్రాంతాల్లో తిరిగింది. కార్యక్రమంలో పార్టీ జోన్‌ కార్యదర్శి వి.కృష్ణారావు, నాయకులు కుమారి, ఎంవి.త్రినాధరావు పాల్గొన్నారు.