ఊహించని రీతిలో పింఛన్లు పెంపు
ప్రజాశక్తి-ఉదయగిరి : ఎవరూ ఊహించని రీతిలో వైఎస్‌ఆర్ పెన్షన్‌లను పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందని నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో నూతనంగా మంజూరైన 253 పెన్షన్‌ను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు పెన్షన్ మంజూరు కావాలంటే నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ కాళ్లు అరుగేలా తిరిగే వారని నేడు అలాంటి పరిస్థితి లేదన్నారు. వలంటీర్ వ్యవస్థతో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ మంజూరు చేసి ప్రతినెలా ఒకటో తేదీ తెల్లవారు కముందే ఇంటి వద్దకే పెన్షన్ అందించిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. ఆనాటి పాదయాత్రలో భాగంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఒంటరి మహిళలు డయాలసిస్ పక్షవాతం పేషెంట్ల కష్టాలు చూసి చలించిపోయిన జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక నిండు భరోసా కల్పించారన్నారు. ఎవరిపై ఆధారపడ కుండా జీవించే హక్కును వారికి కల్పించి ఇంటి పెద్ద కొడుకులా స్వతంత్రంగా జీవించే హక్కును కల్పించారన్నారు. 2024లో మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని ప్రతి ఒక్కరూ సైనికుడిగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో యువ నాయకులు మేకపాటి అభినయరెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు గాజుల తాజుద్దీన్, మాజీ సొసైటీ చైర్మన్ మూలే వినరు రెడ్డి, సొసైటీ అధ్యక్షులు రమణారెడ్డి, మండల కన్వీనర్ అక్కి భాస్కర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షురాలు మట్ల శాంతి, ఎంపిటిసి గొల్లపల్లి తిరుపతయ్య మండల కోఆప్షన్ సభ్యులు సుభాని, సర్పంచులు కల్లూరు వెంకటేశ్వర రెడ్డి గౌస్ మొహిద్దీన్ మండల జెసిఎస్ అధ్యక్షులు కల్లూరు కష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










