ఊహించలేనంతగా తిరుపతి రోడ్ల విస్తరణ : భూమన
పజాశక్తి -తిరుపతి టౌన్
తిరుపతి నగరంలో ఎవ్వరూ ఉహించలేనంతగా నూతన రహదారులను తీసుకురావడమే కాకుండా అంతర్గత రోడ్లను విస్తరించి నగరాభివద్దికి కషి చేస్తున్నామని టీటీడి చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం 4 కోట్ల 78 లక్షల వ్యయంతో నిర్మించిన రెండు సిసి రోడ్లను, డ్రైన్లను ప్రారంభించారు. భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ రెడ్డి, ముద్ర నారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో తిరుపతిలో ఒకవైపున అభివద్ధి, మరోవైపున సంక్షేమంతో దూసుకు పోతున్నదన్నారు. తిరుమల ఆలయంలో ఆనంద నిలయాన్ని నిర్మించిన పాలకులు వీర నరసింగ యాదవ రాయ మార్గముగా పేరును పెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంధ్రా రెడ్డి, కార్పొరేటర్లు పుల్లూరు అమరనాధ రెడ్డి, ఆధం రాధాకష్ణ రెడ్డి, బోకం అనీల్ కుమార్, తిరుపతి మునిరామిరెడ్డి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
టిటిడి విశ్రాంత ఉద్యోగులకూ
200 ఎకరాలు
టిటిడి రిటైర్డ్ ఉద్యోగులకూ ఇంటి స్థలాలు ఇచ్చేందుకు సిఎం జగన్మోహన్‌రెడ్డి అంగీకరించారని, ఇందుకోసం మరో 200 ఎకరాలు కేటాయిస్తామని, ఏ ఒక్కరినీ అసంతృప్తికి గురిచేసే అవకాశం లేదని టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 18న సోమవారం సిఎం జగన్మోహన్‌రెడ్డి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేస్తారని, తొలుత శ్రీనివాస సేతు ప్రారంభించి, ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణీ చేసి, అనంతరం గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటిస్థలాల పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక, శ్రీనివాస సేతు, తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి నగరం సిగలో మరో మణిహారం కాబోతున్న శ్రీనివాస సేతును ప్రారంభిస్తారని, రూ.650 కోట్లతో నిర్మించిన ఈ వంతెనపై 19వ తేదీ నుంచి వాహనాల రాకపోకలకు అనుమతిస్తారని అన్నారు. తమది అభివృద్ధి, ఆధ్యాత్మిక, ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, జెఇఒ సదా భార్గవి, కమిషనర్ హరిత, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, కార్పొరేషన్ ఎస్‌ఇ మోహన్, ఆఫ్కాన్ సంస్థ మేనేజర్ రంగస్వామి పాల్గొన్నారు.
శ్రీనివాస సేతు వద్ద ఛైర్మన్ పరిశీలన










