
ప్రజాశక్తి-కొండపి: ఉగ్రవాది కంటే ప్రమాదకరంగా రాష్ట్రంలో జగన్‌రెడ్డి పాలన సాగుతోందని కొండపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. శుక్రవారం కొండపిలోని బిసి కాలనిలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కరప్రతాలు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఎంత మేలు జరుగుతుందో వివరించారు. ఈ సందర్భంగా ఎమెల్యే స్వామి మాట్లాడుతూ సుపరిపాలనలో ముసుగులో గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని నిప్పులు చెరిగారు. అవాళ ఆర్టిఎక్స్ కన్నా అత్యంత ప్రమాదకర ఆయుధంగా రాష్ట్రంలో నకిలీ మద్యం విచ్చలవిడిగా ప్రభుత్వమే మద్యం షాపుల్లో మనుషులను పెట్టి మరీ అమ్మకం సాగిస్తోందన్నారు. ప్రజల ప్రాణాలు నిట్టనిలువునా గాలిలో కరిగిపోతున్నా అత్యంత కర్కశంగా ఖజానా నింపుకోవడంపైనే ధ్యాస తప్ప ప్రజల ఆరోగ్యం ప్రాణాలంటే వైసిపి సర్కార్‌కు లెక్కలేదన్నారు. కొండపి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే ఒక్క టిడిపి ప్రభుత్వం హయాంలో జరిగిందే తప్ప వైసిపి ప్రభుత్వంలో ఏమి జరగలేదన్నారు. కొండపిలో దామచర్ల ఆంజనేయులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండపిలో పొగాకు బోర్డు, ఆర్టీసి బస్టాండ్, గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ఎన్నో ప్రజలకు మేలు జరిగే వాటికి తీసుకొని వచ్చి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మరలా 2014 ఎన్నికల్లో టిడిపి హయాంలో కొండపిలో 90 శాతం వరకు సిసి రోడ్డు వేసి ఘనత మాకే దక్కుతుందని అన్నారు. బిసి కాలనీ ఏర్పాటు చేసిందని పెద్దాయన దామచర్ల ఆంజనేయులే అన్నారు. ఇప్పటికీ బిసి కాలనిలో ఎంతో మంది జీవనం సాగిస్తుందన్నారు. బిసి కాలనీ ఇంత అభివృద్ధి జరిగిందంటే ఒక్క టిడిపి ప్రభుత్వంలోనే అన్నారు. కాని అధికార పార్టీ బిసి కాలనీకి చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ ఉపాద్యక్షులు జి రామయ్యచౌదరి, మండల పార్టీ అధ్యక్షులు బి యలమందనాయుడు, రాష్ట్ర నాయకులు వసంతరావు, మాజీ ఎంపిపి దేపూరి రత్తమ్మ, మండల మహిళా నాయకులు బి ప్రసన్న లక్ష్మి, నన్నూరి సుబ్బరామయ్య, బి సోమయ్య, షేక్ కాలేషా, కందిమళ్ల రమేష్, దేపూరి సుబ్బారావు, కాశయ్య, ముక్కు ప్రసాదు, బి అనిల్‌కుమార్, మునగల జాన్, దేపూరి మస్తాన్, పట్టణంలో మహిళా నాయకులు, బిసి కాలనీ టిడిపి నాయకులు, మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.