Mar 14,2023 17:46

పగిడ్యాలలో జగనన్న కాలనీలోని ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్న ఎంపిడిఒ

ఉగాదికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి : ఎంపిడిఒ
ప్రజాశక్తి - పగిడ్యాల

      ఉగాది పండగకల్లా జగనన్న కాలనీల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపిడిఒ వెంకటరమణ లబ్దిదారులకు సూచించారు. మంగళవారం పగిడ్యాల జగనన్న కాలనీలోని ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి త్వరగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయిచాలని అసిస్టెంట్‌ ఇంజనీర్లకు ఆదేశించారు. పనులు పెండింగ్‌ లేకుండా ఎప్పకటికప్పుడు బిల్లులు జియోట్యాగ్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇఒఆర్‌డి పుల్లయ్య పాల్గొన్నారు.