ప్రజాశక్తి-అనకాపల్లి : కవులకు ఉగాది పండగ ప్రత్యేక పర్వదినమని కవి సమ్మేళనంలో పాల్గొన్న పలువురు సాహితీ మిత్రులు పేర్కొన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో మంగళవారం శోభకృత్నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని అనకాపల్లి సాహితీ మిత్రులు, తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సాహితీ వసంతం పేరిట కవి సమ్మేళనం నిర్వహించారు. ప్రముఖ కవి గొంతిన రంగబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగు భాష పరిరక్షణ సమితి కన్వీనర్ కోయిలాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రపంచ కవిత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సీనియర్ కవి మాధవి సనారా ఆధ్వర్యంలో రసవత్తరంగా సాగిన కవి సమ్మేళనంలో సుమారు 20 మంది కవులు పాల్గొని తమ కవితలు, పాటలు పద్యాలు ఆలపించారు. అనంతరం కవులను సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి కే శ్రీనివాసరావు, కవులు ఇమ్మడిశెట్టి చక్రపాణి, రాయవరపు సరస్వతి, కోరాడ అప్పలరాజు, శిష్ట్లా తమ్మి రాజు, వజ్రపు త్రినాధరావు, దేవరకొండ లక్ష్మి నారాయణ, భమిడిపాటి కాళిదాసు, గంప శ్రీదేవి, రేగులగడ్డ వెంకట లక్ష్మి గాయత్రి, నాగలక్ష్మి, వీరు నాయుడు, జిఎల్‌ఎన్ శాస్త్రి, సాయిబాబా, మల్లేశ్వరి, అమర జ్యోతి, లలిత, ఉమాదేవి పాల్గొన్నారు.










