ప్రజాశక్తి-బాపట్ల: తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి తెలుగుదేశం పార్టీ బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు నరేంద్రవర్మ ఆధ్వర్యంలో మీ బాట నా మాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు నరేంద్రవర్మ ప్రకటించారు. అందులో భాగంగా సోమవారం పార్టీ కార్యాలయంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బాపట్ల నియోజకవర్గంలో 95 వేల కుటుంబాలను ఆత్మీయంగా పలకరించి సమస్యలు, కష్టసుఖాలు తెలుసుకునేందుకు మీలో ఒకడిగా, మీ సేవకు కదిలి వస్తున్నా అనే నినాదంతో నరేంద్రవర్మ ముందుకెళుతున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పర్యటన కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో మహిళలకు పార్టీ తరఫున చీరలను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మానం విజేత, పల్లం సరోజిని, జిట్టా ప్రమీలారాణి, పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు.










