ఉంగుటూరు సర్వసభ్య సమావేశంలో హౌసింగ్ ఎఇ సురేష్‌బాబు
ప్రజాశక్తి - ఉంగుటూరు
మార్చి 22వ తేదీ ఉగాది నాటికి ఉంగుటూరు మండలంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు నూరుశాతం పూర్తి చేసేందకు కృషి చేస్తున్నామని ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించాలని మండల హౌసింగ్ ఎఇ సురేష్‌బాబు అన్నారు. ఉంగుటూరు ఎంపిపి గంటా శ్రీలక్ష్మి అధ్యక్షతన బుధవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఇ మాట్లాడుతూ మండలంలో 2600 మందికి ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరవ్వగా ఇప్పటివరకు 1900 ఇళ్ల గ్రౌండింగ్ అవ్వగా1200 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. మిగతా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. నిర్మాణాలు అసలు ప్రారంభించని లబ్ధిదారులను చైతన్యం చేయడంలో గ్రామ సర్పంచులు శ్రద్ద చూపాలని కోరారు. తహశీల్దార్ రమణరావు మాట్లాడుతూ పలు గ్రామాల్లో ఇళ్ల స్థలాల కోసం రైతుల నుంచి భూసేక రణకు నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మార్కె ట్ ధరకు రెట్టింపుపైగా ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తా మన్నారు. వ్యవసాయ శాఖ ఎఇఒ కంభంపాటి వాణి మాట్లాడుతూ ఈ సీజన్‌లో ఆర్‌బికెల ద్వారా రూ.99.50 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఆర్‌బికెల ద్వారానే 80 శాతం వరకు ఎరువులు, పురుగుమందులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మాజీ మంత్రి వట్టి వసంత్‌కమార్‌కు నివాళి
మండల పరిషత్ సమావేశం అనంతరం మాజీ మంత్రి, ఉంగుటూరు మాజీ ఎంఎల్‌ఎ వట్టి వసంతకుమార్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన సేవలను పలు వురు నాయకులు, అధికారులు గుర్తు చేసు కున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపిలు సింగిరెడ్డి సూర్యనారాయణ, ఎంపిడిఒ ప్రేమాన్విత, వ్యవసాయ సలహా మండలి సభ్యులు పాపారావు బాబ్జి పాల్గొన్నారు.
సమావేశానికి పలు శాఖల అధికారులు, పలువురు ఎంపిటిసిలు, సర్పంచులు గైర్హాజరయ్యారు. ఉదయం 10.45 గంటలకు కొంతమంది సభ్యులతోనే సమావేశం ప్రారంభమైంది. 11 గంటలు దాటాక కూడా సభ్యులందరూ హాజరు కాకపోవడంతో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వాళ్లందరికి ఫోన్లు చేసి పిలవాల్సి వచ్చి ంది. ఎజెండా ఏమి లేకపోవడం, ప్రతి మూడు నెలలకు ఒక సారి జరపాల్సిన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహి ంచారు. మండలానికి చెందిన వివిధ కేటగిరిల కింద 11 మంది ఉద్యోగులకు రిపబ్లిక్ డే రోజున ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్నవారిని సత్కరించారు.










