ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: ఉద్యోగులు, అధికారుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ చేయగలుగుతున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. జిల్లా కలెక్టర్‌గా పదవీ భాధ్యతలు చేపట్టి ప్రధమ సంవత్సరం పూర్తి చేసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావును ఏపిఎన్‌జివో అసోసియేషన్ ఎన్‌టిఆర్ జిల్లా మరియు విజయవాడ నగరశాఖ కార్యవర్గ సభ్యులు కలిసి మంగళవారం అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ను అభివృద్ధి పదంలో అగ్రగామిక నిలపడంలో ఉద్యోగుల సహకారం ఎంతో కీలమైనదన్నారు. జిల్లా యంత్రాంగం ఉద్యోగులకు అప్పగించిన లక్ష్యాలను సాధించడంలో మరింత కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో ఉద్యోగులు సహకారం ఎంతో అవసరమన్నారు. పారదర్శకమైన సేవలను అందించి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ఏపిఎన్‌జివో జిల్లా అధ్యక్షులు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాల పునవ్యస్తీకరణ అనంతరం ఏర్పడిన నూతన జిల్లాకు కలెక్టర్‌గా పదవీ భాధ్యలు చేపట్టి ప్రజా రంజక పాలన అందించడంలో వినూత్నశైలిని అవలంభిస్తూ రాష్ట్రంలోనే ఎన్‌టిఆర్ జిల్లాను మార్గదర్శకంగా నిలపడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్‌గా సామాన్య ప్రజల సమస్యలను ఓర్పుగా విని, స్వయంగా పరిష్కార మార్గాన్ని కనుగొన్ని కింది స్థాయి అధికారులకు సూచించి పరిష్కరిస్తున్న తీరు ఆయా వర్గాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్న ఉద్యోగులను వెన్ను తట్టి ప్రోత్సహించడం ఉద్యోగులు మరింత ఉత్సహాంగా పనిచేయుటకు దోహదపడుతుందన్నారు. ప్రజలకు సేవలందించడంలో జిల్లాకు చెందిన ఉద్యోగులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. దైనందిక విధులతో పాటు జిల్లా యంత్రాంగం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్దంగా ఉంటారన్నారు. జిల్లా కలెక్టర్‌కి అభినందనలు తెలిపిన వారిలో ఏపిఎన్‌జివో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యండి ఇక్బాల్, కారవర్గ సభ్యులు బి. సతీష్ కుమార్, యం రాజుబాబు, డి. విశ్వనాథ్, సిహెచ్ మధుసుదన్‌రావు, నాగేంద్రరావు, బివి రమణ, నగర కార్యవర్గ సభ్యులు కె. శివలీల, సిహెచ్. శ్రీరామ్, కె. సంపత్‌కుమార్, నజీర్‌ఉద్దీన్, వి.వి.ప్రసాద్, కాశీమ్, గణేష్, వరప్రసాద్, కె. శివశంకర్ ఉన్నారు.










