Mar 10,2023 00:09

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ధనలక్ష్మి

ప్రజాశక్తి-చీరాల : ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా ఒత్తిళ్లకు గురి చేస్తూ వారిని రోడ్డున పడేసిన ఘనత ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.ధనలక్ష్మి ,కె.ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వ వేధింపులు మానుకోవాలని, సిపిఎస్‌ రద్దు చేసి పాత పెన్షను విధానాన్ని పునరుద్ధించాలని, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరుతూ స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తిప్పికొట్టాలన్నారు. గత మూడున్నర ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై వేధింపులు పాల్పడుతుందని ఆరోపించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిచడం చేతకాని ప్రభుత్వం వైసిపి ప్రభుత్వమేనని తెలిపారు. ప్రభుత్వ తీరుపై ఎవరైనా నోరు మెదిపితే వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. నిర్బంధ కాండకు పాల్పడు తుందన్నారు. గతంలో ఎప్పుడూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేపట్టిన ఘటనలు లేవని తెలిపారు. కేలవం చర్చల ద్వారా సమస్యలను పరిష్క రించుకున్నట్లు తెలిపారు. 11వ పిఆర్‌సి ఒప్పందానికి సంబంధించిన ఏరియర్స్‌ ఇంత వరకూ చెల్లించలేదని తెలిపారు. ఉద్యోగులను వేధిస్తున్న వేధిస్తున్న ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక,శ్రామిక వర్గాల ప్రజా సమస్యలపై శాసనమండలిలో మాట్లాడే పిడిఎఫ్‌ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు వి.నగారాని, సిపిఎం జిల్లా నాయకులు టి.కష్ణ మోహన్‌, చీరాల కార్యదర్శి ఎన్‌.బాబూరావు, ఎం.వసంతారావు, పి. కొండయ్య, ఎల్‌.జయరాజు, డి.నారఫరెడ్డి, రాదా, సత్యమూర్తి, మనోజ్‌, కిరణ్‌, ఆర్యా, లక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.