ప్రజాశక్తి- అనకాపల్లి : ఉద్యోగులపై కక్షతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లేనిపోని విధానాలను తెస్తున్నారని, అందులో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ యాప్ ఒకటని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం గవరపాలెంలో జరిగిన ఆర్‌ఎంపి వైద్యుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన సిఆర్‌పి రద్దు హామీని అమలు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఒత్తిడి చేయడంతో వారిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్‌ను అమల్లోకి తెచ్చారన్నారు టిడిపి హయాంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైసిపిని తిరస్కరించడం దాదాపు ఖాయమైపోయిందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ఆర్‌ఎంపి వైద్యుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కమిటీ సభ్యులు వి సత్యనారాయణ, నారాయణరావు, కోశాధికారి బుద్ధ సోమేశ్వరరావు, అలంక బోగేష్, పీలా రామారావు పాల్గొన్నారు.










