ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్
ప్రజాశక్తి కంచికచర్ల
ఉద్యోగుల డిమాండ్ల పరిష్కరం కోసం ఏపి ఎన్జీవో సంఘం నిరంతరం కషి చేసిందని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ అన్నారు. స్థానిక బస్టాండ్ వెనుకగల ఏపీ ఎన్జీవో హౌంనందు గురువారం కంచికచర్ల ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎ విద్యాసాగర్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అనేది రాష్ట్రంలో ఉద్యోగుల పక్షనే కాకుండ దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పక్షాన కూడా పోరాడి నిలిచిందని, అంతటి ప్రాధాన్యత కలిగిన సంఘం ఏపీ ఎన్ జీ ఓస్ సంఘమని అన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉద్యోగుల శ్రేయస్సు పై నిరంతర పోరాటాలు చేస్తుందని ఆయన తెలిపారు. కంచికచర్ల తాలూకా యూ నిట్ సంఘ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులం దరూ ప్రజా స్వామ్య యుతంగా పాల్గొని మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి ఇక్బాల్, జిల్లా ఉపాధ్యక్షుడు యం రాజుబాబు, మధుసూదన్ రావు, రాజశేఖర్, కంచికచర్ల తాలూకా యూనిట్ అధ్యక్షుడు ఎ వి శివారెడ్డి, కార్యదర్శి యం బిక్షాలు, కోశాధికారి నాగులు, సంఘ నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.










