Oct 20,2023 20:51

దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఓబులు

 రాయచోటి : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు సొమ్మును దోపిడీ చేసేందుకే జగన్‌ ప్రభుత్వం జిపిఎస్‌ను తెరపైకి తెచ్చిందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ పాత పెన్షన్‌ సాధనకై చేస్తున్న నిరవధిక దీక్ష రెండవ రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా దీక్షా శిబిరానికి రాష్ట్ర సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ప్రస్తుత జగన్‌ పాలన నియంతత్వ పోకడలతో ఉద్యమాలను అణ చివేసే దిశగా సాగుతుంది అన్నారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బిల్లా హరి ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రస్తుత జిపిఎస్‌లో లోపాలు చాలా ఉన్నాయని, ఉద్యోగులు కాంట్రిబ్యూట్‌ చేసేటువంటి సొమ్మును ప్రభుత్వం దోపిడీ చేయాలనే కుట్రతో ఉంది అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జాబిర్‌ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులంతా ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ ఆలోచనలో ఉన్నారని మున్ముందు జరగబోయే ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవ హరించడం తగదని వెంటనే న్యాయమైన డిమా ండ్లను పరిష్కరించాలి అన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ రామ్‌ పురుషోత్తం దీక్ష శిబిరం వద్దకు వచ్చి యుటిఎఫ్‌ నాయకుల ఆరోగ్యం క్షీణిం చిందని స్వయంగా తెలుసుకొని డిమాండ్లను ప్రభుత్వం దష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చి నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్‌ చంద్రశేఖర్‌, జిల్లా సిపిఎస్‌ కన్వీనర్‌ సివి రమణమూర్తి ,జిల్లా కార్యదర్శి పురం. వెంకట రమణ, యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు దావుద్దీన్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సురేంద్ర రెడ్డి, యూటిఎఫ్‌ జిల్లా మహిళా కార్యదర్శి గంగాదేవి , సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాం జనేయులు, ఎపిసిపిఎస్‌ఇఎ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఫయాజ్‌ యుటిఎఫ్‌ నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉద్యోగుల జీవితాలతో చెలగాటం :ఆర్‌ఆర్‌
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుండి రాష్ట్రంలోని ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని నియోజవర్గ టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదురుగా పాత పెన్షన్‌ సాధనకై చేపట్టిన నిరసన దీక్షను మాజీ ఎమ్మెల్యే రమేష్‌ కుమార్‌రెడ్డి సందర్శించి ఉపాధ్యాయులకు సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాటా ్లడుతూ ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్ర సంద ర్భంగా ఎన్నో మాయమాటలు చెప్పి ఉపాధ్యాయ, ఉద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చాక నిలువునా మోసం చేశారని విమర్శించారు. అధికా రంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్‌ రద్దు చేసి,పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని,పిఆర్సిని విడుదల చేస్తామని, పెండింగ్‌ బిల్లులన్నీ చెల్లిస్తామని హామీలు గుప్పించి ఉద్యోగుల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న ఇంతవరకు ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను చర్చ ద్వారా పరిష్కరించడమే కాకుండా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాల కల్పనకు టిడిపి ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాషా, రాయచోటి మండల టిడిపి అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి,యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరిప్రసాద్‌,జాబీర్‌,పట్టణ నాయకులు ఫయాజ్‌ తదితర ఉపాధ్యాయులు,ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ నాయకులు పాల్గొన్నారు.
దీక్షను అడ్డుకున్న ఎంపిడిఒ
రాజంపేట అర్బన్‌ : సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దు చేసి ఒపి ఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ నాయకులు శుక్రవారం ఎంపిడిఒ కార్యాలయం ఆవరణలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్షకు అనుమతి లేదంటూ ఎంపీడీవో ఫణి రాజ కుమారి దీక్షను అడ్డుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు, ఎంపిడిఒ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీక్ష శిబిరాన్ని కూడా తొలగించినప్పటికీ యుటిఎఫ్‌ నాయకులు మధ్యాహ్నం వరకు దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ ఎంపిడిఒ అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల కిందట ఏవో బాల మునిస్వామికి ముందస్తు సమాచారం ఇచ్చామన్నారు. ఎంపీడీవో ఫణి రాజకుమారి ఉన్నతాధికారుల ఒత్తిడితో తమ వద్ద ఎలాంటి వివరణ కూడా తీసుకోకుండా దీక్షా శిబిరాన్ని తొలగించడం బాధాకరమని అన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించుకునేందుకు శాంతియుతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా అని ప్రశ్నించారు. యుటిఎఫ్‌ నాయకుల దీక్షకు సిఐటియు జిల్లా అధ్యక్షులు రవికుమార్‌, ఎస్‌ ఎఫ్‌ ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. శుక్రవారం దీక్షలో యుటిఎఫ్‌ నాయకులు జి.నాగేంద్ర, చంగల్‌ రాజు, కవలకుంట్ల పాపయ్య, కే.రామచంద్ర, ఉదరు భాస్కర్‌, విశ్వనాథ్‌, నరసింహారావు, రఫీ పాల్గొన్నారు. వీరి దీక్షకు ఉపాధ్యాయులు నాగేశ్వర గౌడ్‌, వెంకటసుబ్బయ్య, సాంబశిరావు, శ్రీనివాసులు, సి.వెంకటసుబ్బయ్య, ఈశ్వరయ్య, తులసమ్మ, అరుణాదేవి, భాగ్యలక్ష్మి, లలిత దేవి, ఉపాధ్యాయుడు ఎస్‌.వి సుబ్బరాజు, సుబ్రహ్మణ్యం పాల్గొని దీక్షకు తమ సంఘీభావం తెలిపారు.