Aug 06,2023 23:38

ప్రజాశక్తి-కాకినాడ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని అందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకష్ణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ ఆర్‌ అండ్‌ బి అతిథి గృహంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కాకినాడ జిల్లా, కాకినాడ నగర బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తాననన్నారు. అనంతరం మంత్రి వేణు సమక్షంలో జిల్లా, నగర కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌.నాగేశ్వరరావు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు రామానుజన్‌ శ్రీనివాస్‌ రావు, డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అధ్యక్షుడు గుబ్బల మురళీకష్ణ మాట్లాడారు. తొలుత మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్‌ చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కమిటీ గౌరవ సలహాదారుడు దొమ్మేటి సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి గంటి రాధాకృష్ణ, కోశాధికారి వాసంశెట్టి కామేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు చిందాడ ప్రదీప్‌ కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు పంపన సూర్య ప్రకాష్‌ రావు, నగర కమిటీ గౌరవ సలహాదారుడు మల్లాడి రామ్‌ గోపాల్‌ వర్మ, అధ్యక్షుడు చోడే శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి సంగాడి రాజసింహ వర్మ, కోశాధికారి ములంపాక శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాసరావు, ఎల్లబోయిన మురళి, గౌరవ అధ్యక్షుడు వాసంశెట్టి మహేష్‌, పిపిలు పితాని శ్రీనివాసరావు, పిల్లి దుర్గా ప్రసాద్‌ మహిళా నాయకురాలు దుర్గారాణి, మణిమాల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ సంఘ నాయకులు హాజరయ్యారు.