ప్రమాణం చేయిస్తున్న గంగాధర్
ప్రజాశక్తి-చోడవరం :ఎపిపిఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం చోడవరం తాలూకా యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. చోడవరంలోని ఎంపిడిఒ కార్యాలయంలో ఎన్నికలు శనివారం జరిగాయి. యూనిట్ అధ్యక్షునిగా ఎల్.కామేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్‌గా పి.రామారావు, సెక్రటరీగా సి. హెచ్ సింహాచలం, జాయింట్ సెక్రటరీగా ఎ.బాలాజీరావు, ట్రెజరర్‌గా బి.పుష్పలత, జిల్లా కౌన్సిలర్ 1గా కె.శ్రీనివాసరావు, జిల్లా కౌన్సిలర్ 2గా డి.కొండలరావులు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల అధికారిగా జి.గంగాధర్, పర్యవేక్షకులుగా ఎస్.సత్తిబాబు( జిల్లా ప్రెసిడెంట్) వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులకు గౌరవ అద్యక్షులు యు.కూర్మారావు అభినందనలు తెలిపారు.










