పర్చూరులో నిరసన ప్రదర్శన చేస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-పర్చూరు: ఉద్యోగుల ఓపిఎస్ రద్దు చేయాలని కోరుతూ పర్చూరు బొమ్మల సెంటర్‌లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి మజుందార్ మాట్లాడుతూ ఉద్యోగులపై వేధింపులు, కక్షసాధింపు చర్యలు ఆపాలని, పిఆర్‌సి బకాయిలు వెంటనే ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని కోరారు. అనంతరం పర్చూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో చిమటా వెంకటేశ్వర్లు, డేవిడ్, ట్రైసన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










