Apr 12,2023 23:58

మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి-అనకాపల్లి
ఉద్యోగుల సమస్యల పరి
ష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం ఏపీ జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగ పింఛనుదారుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన 50 పేజీల మెమోరాండంలో తెలియజేసిన డిమాండ్లన్నీ పరిష్కరించాలని కోరారు. ఒకటవ తేదీన జీతాలు, పింఛన్లు ఇవ్వాలని, 11వ పిఆర్సి ప్రతిపాదించిన స్కేల్స్‌ బయట పెట్టాలని, పెండింగ్‌ నాలుగు డీఎల ఏరియర్స్‌ చెల్లించాలని, పిఆర్సి ఏరియర్స్‌ చెల్లింపు, 12వ పిఆర్‌సి కమిషన్ను వెంటనే నియమించాలని, పెండింగ్‌లో ఉన్న మూడు కొత్త డీఏలను విడుదల చేయాలని, సిపిఎస్‌ రద్దు చేసి ఓపిఎస్‌ అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు చెప్పారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 15న మరణించిన, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించడం, 18న కలెక్టరేట్ల వద్ద సిపిఎస్‌ ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా, 20న సకాలంలో జీతాలు, పింఛన్లు ప్రభుత్వం చెల్లించనందున ఈఎంఐ కట్టాలని ఒత్తిడి, పెనాల్టీలు వేయకుండా బ్యాంకుల సందర్శన, 25న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్‌ సిబ్బంది సమస్యలపై కలెక్టరేట్‌ వద్ద ధర్నా, 27న రిటైర్డ్‌ ఉద్యోగుల ఇల్లుల సందర్శన, పింఛన్లు అందని వారిని పరామర్శ, 29న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో కలెక్టరేట్లు వద్ద ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.