Jun 25,2023 00:45

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తామని స్థానిక యుటిఎఫ్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌ నారాయణ, ఎస్‌.బాలకృష్ణ చెప్పారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో యుటిఎఫ్‌ మండల శాఖ కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యోగులను ప్రభుత్వం అనేక విధాలుగా నయవంచన చేసిందన్నారు. సిపిఎస్‌ని వారం రోజుల్లో రద్దు చేస్తానని హామీనిచ్చి జిపిఎస్‌ను బలవంతంగా రుద్దుతుందన్నారు. దీంతో ఉద్యోగులు అనేక విధాలుగా నష్టపోతున్నారన్నారు. జిపిఎస్‌ని ఎప్పటికీ ఉద్యోగులు అంగీకరించరన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఎం.మోహన్‌, కే బాబ్జి, బి.శ్రావణ్‌ కుమార్‌, మల్లికార్జున్‌, మేఘనాథ్‌ పాల్గొన్నారు.