సమావేశంలో మాట్లాడుతున్న చాంద్‌బాషా
ప్రజాశక్తి-గుంటూరు : ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ప్రాధాన్యతాంశంగా తీసుకోవట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సయ్యద్ చాంద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నగరంపాలెంలోని ఎపిజిఇఎ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. ఈ రోజు వరకూ ప్రభుత్వం ఒక్క డిఎ కూడా మంజూరు చేయకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి, ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించి, ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కరీముల్లా షాఖాదరి, జిల్లా ఉపాధ్యక్షులు మహేష్‌బాబు, నగర శాఖ అధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు రత్తయ్య, హుస్సేన్‌ఖాన్ పాల్గొన్నారు.










