Apr 17,2023 01:26
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం

ప్రజాశక్తి-బాపట్ల: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండాగా కృషి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బాపట్ల జిల్లా శాఖ నూతన అధ్యక్షులు చంద్రకుమార్‌ అన్నారు. ఆదివారం బాపట్లలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బాపట్ల జిల్లా సంఘం అడహాక్‌ కమిటీ సమావేశంలో చంద్రకుమార్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సంఘం పోరాటం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా చంద్రకుమార్‌ తోపాటు జిల్లా కార్యదర్శిగా రోశయ్య, జిల్లా గౌరవ సహాయ అధ్యక్షులుగా బి ఓంకార్‌, జిల్లా కార్యవర్గం ఎంపికయ్యింది. సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏర్పాటుకు రాష్ట్ర ఆర్గనైజేషన్‌ కార్యదర్శి నాగసాయి, గుంటూరు జిల్లా అధ్యక్షులు సయ్యద్‌ చాంద్‌బాషా, ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి వరకుమార్‌ తదితరులు హాజరయ్యారు.