Oct 16,2023 23:32

కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎపిఎన్‌జిఒ నాయకులు
గుంటూరు: ఉద్యోగుల సమస్యలపై అందే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి డిప్యూటీ కమిషనర్లను, విభాగాధిపతులను ఆదేశించారు. సోమ వారం జిఎంసి కౌన్సిల్‌ హాల్లో ఎంప్లాయీస్‌ గ్రీవెన్స్‌ నిర్వ హించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఉద్యోగులు అర్జీలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని, వచ్చే నెలలో జరిగే గ్రీవెన్స్‌ నాటికి ప్రస్తుతం అందిన ఆర్జీల పరిష్కార వివరాల రిపోర్ట్‌తో హాజరు కావాలని మేనేజర్‌ని ఆదేశించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణా చర్యలు తీసుకోబడిన సిబ్బందిపై అధికారుల విచారణ నివేదికలతో డిప్యూటీ కమిషనర్‌ చర్చించాలని ఆదేశించారు. అనంతరం ఉద్యోగుల సమ స్యలపై స్పెషల్‌ గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్న కమిషనర్‌ను ఏపీ ఎన్‌జిఒ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.శ్రీనివాస్‌, సతీష్‌కుమార్‌ ఇతర నాయకులు కలిసి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీనివాస రావు, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ భానుప్రకాష్‌, మేనేజర్‌ శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్‌ కార్మికుని కుటుంబానికి పరిహారం
నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ విభాగంలో, హెడ్‌వాటర్‌ వర్క్స్‌లో పనిచేస్తూ ఇటీవల అనా రోగ్యంతో మరణించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి టి.గంగాధర రావు కుటుంబానికి నగర కమిషనర్‌ కీర్తి చేకూరి ఎక్స్‌గ్రేషియా అందచేశారు. కార్మికుడి భార్య శివపార్వతికి ఎక్స్‌గ్రేషియా చెక్కు రూ.2 లక్షలు అందజేశారు. అలాగే నగరపాలక సంస్థ నుండి అందాల్సిన పరిహారాలు, పి.ఎఫ్‌. కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.