Aug 13,2023 20:54

జడ్‌పి చైర్మన్‌ను సన్మానిస్తున్న ఉద్యోగుల సంఘం నాయకులు

జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్‌ నాధరెడ్డి
కడప ప్రతినిధి : పంచాయతీరాజ్‌ మినీస్టీరియల్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్‌ నాధరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పరిషత్‌ కార్యాలయ సబాభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి సర్వ సభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు రెండు కళ్లు లాంటి వారన్నారు. త్వరలో రాష్ట్రంలోని 13 జిల్లాల జడ్‌పి చైర్మన్ల సమావేశాన్ని నిర్వహిస్తామని, చైర్మన్లందరూ కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని తెలిపారు. అంతకు మునుపు సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి జీల్లాలో పర్యటించనున్న సందర్బంగా ఆయన దష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. ముఖ్యమంత్రి ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూల దక్పధాన్ని కలిగి ఉంటారన్నారు. ఇందులో భాగంగానే జడ్‌పి కారుణ్య నియామకాలు మొదలు జీతాల చెల్లింపుల సమస్యల ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొని దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం పంచాయతీరాజ్‌ మినీస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డిని శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ మినీస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్ష,కార్యదర్శులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లంకా మల్లేశ్వరరెడ్డి, బసిరెడ్డితోపాటు బాలుడు, సురేష్‌, చంద్ర, సోమశేఖర్‌ సహా రాష్ట్రలోని వందలాది మంది నాయకులు, ఉద్యోగులు పాల్గన్పారు.