ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా పరిషత్ ఉద్యోగుల సహాయ సహకారాలు మరువలేనివని జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గురువారం జెడ్‌పి సమావేశ మందిరంలో ఎపి పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లాస్థాయి కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జెడ్‌పి చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఉద్యోగ సంఘ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కషి చేస్తానని తెలిపారు. యూనియన్ బిల్డింగ్ ఆధునీకరణకు కావలసిన నిధులను జెడ్‌పి నుంచి సమకూరుస్తారని తెలిపారు. సమావేశంలో జెడ్‌పి సిఇఒ రాజ్ కుమార్, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చింతాడ మురళి, కార్యదర్శి వి. రాంబాబు, సహా అధ్యక్షులు కెబి శ్రీనివాసరావు, కోశాధికారి, పిఎం రవికుమార్ పాల్గొన్నారు.










