Aug 18,2023 20:49

కలెక్టర్‌కు సమస్యలు చెబుతున్న ఉద్యోగులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్‌ గ్రీవెన్స్‌ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్పందన హాలులో జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలపై వినతులను శుక్రవారం స్వీకరించారు. 20 మంది ఉద్యోగులు తమ సమస్యలను వినతి పత్రాలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.