Aug 17,2023 00:01

వినతిపత్రం అందిస్తున్న అసోసియేషన్‌ ప్రతినిధులు

ప్రజాశక్తి - కాకినాడ
తమకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ టెక్నిల్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.వి.సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో నాయకులు ఎస్‌ఇ కె.హరిప్రసాద్‌బాబుకు బుధవారం వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్‌ తదితర శాఖల్లో ఖాళీ అయిన పోస్టుల్లో టెక్నికల్‌ ఆఫీసర్లకు ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్‌ విభాగాల్లో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల నియమాకాలు చేపట్టాలని కోరారు. టెక్నికల్‌ ఆఫీసర్ల సమస్యలు ఆర్థిక పరమైనవి కావని స్పష్టం చేశారు. ఎస్‌ఇని కలిసిన వారిలో ఎపిటిఒఎ స్టేట్‌ కన్వీనర్‌ ఎం.ఏడుకొండలు, అసోసియేషన్‌ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ తాడాల దొరబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు, జనరల్‌ సెక్రటరీ ఎం.శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు ఎస్‌ఎస్‌.కష్ణ, సంఘ సభ్యులు పాల్గొన్నారు.