Jun 29,2023 21:19

ఉపాధ్యాయులను సన్మానిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

రాజంపేట అర్బన్‌ : స్థానిక జిల్లా పరిషత్‌ ఉర్దూ ఉన్నత పాఠశాలలో గురువారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో మండల శాఖ అధ్యక్షులు ఎం.రమణయ్య అధ్యక్షతన ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మండల విద్యా శాఖ అధికారి గంగిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగోన్నతి పొందిన ఉపాధ్యాయులను సన్మా నించడం అనే కొత్త సంప్రదాయానికి యుటిఎఫ్‌ నాంది పలకడం శుభ సూచిక మన్నారు. రెండవ మండల విద్యాశాఖ అధికారి సుబ్బరాయుడు మాట్లా డుతూ పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చదిద్దవలసిన బాధ్యత అందరి మీద ఉన్నదని తెలిపారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బి.హరిప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన 117 జీవో పైన యుటిఎఫ్‌ చేసిన పోరాటాల ఫలితంగా మూడు కిలోమీటర్ల లోపల ఉన్న పాఠశాలలను తప్పించి కేవలం ఒక కిలోమీటర్‌ దూరంలో ఉన్న పాఠశాలలను మాత్రమే విలీనం చేయడం జరిగిందని తెలి పారు. భవిష్యత్తులో యుటిఎఫ్‌ ఉద్యమాలకు పిలుపునిచ్చినప్పుడు ఉపాధ్యా యులు ఉద్యమాలలో పాల్గొనాలని కోరారు. పిఎంపి కేజియాలత, కెవిఎస్‌ కిషోర్‌, ఎం.సతీష్‌, కె.వెంకటేశ్వర్లు, ఎం.నాగభూషణం రాజు, జి.శివ నరసింహులు సన్మానం అందుకున్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కోశాధికారి శివయ్య, గౌరవాధ్యక్షులు కే.పాపయ్య, సీనియర్‌ నాయకులు ఎం.నాగేశ్వర్‌ గౌడ్‌, పి.వెంకటసుబ్బయ్య, కే.శివకుమార్‌, ఉపాధ్యాయులు వీరయ్య, శ్రీనివాసులు, వెంకటరమణ, పి.శ్రీనివాసులు, రామచంద్ర, కవిత, రెడ్డమ్మ పాల్గొన్నారు.