కడప అర్బన్ : నగరంలో 13వ డివిజన్ ప్లానింగ్ కార్యదర్శిగా పని చేస్తున్న రామమోహన్‌పై కొందరు వ్యక్తులు సచివాలయంలో కి వెళ్లి దౌర్జన్యంగా చేసిన దాడి చేయడం హేయనీమని ఎపి ఎన్‌జిఒ జిల్లా అధ్యక్షులు, జెఎసి చైర్మన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం సచివాలయ ఉద్యోగులతో కలిసి కార్పొరేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డ్ సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజలకు అన్ని రకాల సేవలను సచివాలయం వ్యవస్థ ద్వారా అందుబాటులో ఉంచారని పేర్కొన్నారు. ప్రజా సేవలో విధులు నిర్వర్తించే క్రమంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను పై అధికారుల ఆదేశాలతో అపారని, సదరు ఉద్యోగులపై దాడి చేయడం దుర్మార్గమని చెప్పారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దాడులు పునరావతం కాకుండా ఎస్పీ, కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయం ఉద్యోగులపై దాడులు జరిగిన వెంటనే స్పందించి బాధ్యులపై కేసులు నమోదు చేయించి, సచివాలయం ఉద్యోగులకు అండగా నిలిచిన కార్పొరేషన్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవికుమార్, నగర అధ్యక్షులు చిన్నయ్య, కార్యదర్శి శైలేస్వర్ రెడ్డి, నాయకులు నాగార్జునరావు, పద్మనాభ రావు, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు హీరా మియ్యా, కార్య దర్శి ప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్ హరి రామ్, నాయకులు లక్ష్మణ్, హేమంత్ కుమార్, కవిత పాల్గొన్నారు.










