
ప్రజాశక్తి-యంత్రాంగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం సమర భేరి అనకాపల్లిలో పలు గ్రామాల్లో ఆదివారం సాగింది. ప్రజలపై భారాలు తగ్గించి పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు.
రోలుగుంట: మండలంలోని ఎంకె.పట్నం, అర్ల, గదబపాలెం, గుర్రాలబయలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ, ప్రభుత్వాలు ప్రజలపై అనేక భారాలు మోపుతున్నాయన్నారు. విద్యుత్ భారాలు తగ్గించాలని, డీజిల్, పెట్రోల్ ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగం రోజురోజుకీ పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో రామారావు, నూకరాజు, సింహాచలం పాల్గొన్నారు
చీడికాడ: మండలంలో పలు గ్రామాల్లో సిపిఎం నేతల ప్రచారం చేశారు.ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ కోణంలో పోస్టర్ విడుదల చేశారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ధరలను నియంత్రణ చేసి ప్రజల జీవనోపాధిని మెరుగుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి కుంభైనా కన్నబాబు, ఏడ దేవుడు, సిఐటియు మండల కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు, సాయికుమార్ లోవరాజు తదితరులు పాల్గొన్నారు.
సిపిఎం సమరభేరి
కె.కోటపాడు : మండలం కేంద్రంలో సిపిఎం సమరభేరిలో భాగంగా ఆదివారం నిరుద్యోగ వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. నిరుద్యోగులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు గండి నాయనబాబు మాట్లాడుతూ నేడు. ఉద్యోగ అవకాశాలు లేక డిగ్రీలు, పిజిలు చదివిన ఎందరో ఉద్యోగాల్లేక కూలి పనులకు వెళ్లే దౌర్భాగ్యస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎర్ర దేవుడు, వనం సూర్యనారాయణ పాల్గొన్నారు.
దేవరాపల్లి: సిపిఎం సమరభేరిలో భాగంగా అధికధరలు, విద్యుత్‌ఛార్జీలమోత, నిరుద్యోగ సమస్యపై చేస్తున్న ఆందోళనలో భాగంగా మండలకేంద్రంలో విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజలను చైతన్య పరిచారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మాట్లాడుతూ, పాలకుల విధానాల వల్లే నేడు నిరుద్యోగం పెచ్చరిల్లిపోతోందన్నారు. ఈనెల 4న తహశీల్దార్ కార్యాలయాలు వద్ద ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో ఎ శ్రీను రామాక్రష్ట ఈశ్వరరావు పాల్గొన్నారు
మునగపాక రూరల్: అధిక ధరలు, విద్యుత్ చార్జీల వడ్డన, నిరుద్యోగ సమస్యలపై సిపిఎం సమరభేరి ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక సంత బయలు, నంది కోవెల ప్రాంతాలలో సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించార. సిపిఎం నేత ఎస్. బ్రహ్మజీ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు పోెటాపోటీగా ప్రజల మీద భారాలు వేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వి వి శ్రీనివాసరావు, జగ్గ అప్పారావు, పెంటకోట సత్యనారాయణ పాల్గొన్నారు.
పరవాడ:అధిక ధరలు, విద్యుత్ చార్జీలు భారీ వడ్డన, నిరుద్యోగ సమస్యలపై సిపిఎం సమరభేరి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం దేశపత్ని పాలెం, పి బోనంగి, గ్రామాల్లో సిపిఎం నాయకులు పి మాణిక్యం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో పిడి నాయుడు, లక్ష్మి, వెంకటలక్ష్మి రమణమ్మ పాల్గొన్నారు.