ప్రజాశక్తి-యంత్రాంగం
ఆదివాసీలపై అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ సిపిఎం చేపట్టిన సమర భేరి కార్యక్రమాన్ని అల్లూరి జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు గ్రామ గ్రామాన చేపట్టారు. పలు చోట్ల ప్రచారం నిర్వహించిచారు.
ముంచింగిపుట్టు:మండలంలోని జర్రెల గ్రామ పంచాయతీ డేగలుపుట్ గ్రామంలో సిపిఎం సమర బేరీని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.సురేంద్ర నిర్వహించారు.ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతుందన్నారు. జగన్ ప్రభుత్వం మోడీకి భజన చేస్తూ , బిజెపి ఆదేశాలను ఆంధ్రలో అమలు చేస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సరుకుల ధరలను తగ్గించాలని, జీవో 3 రిజర్వేషన్ పునర్ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పి భీమరాజు, కె నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
పోస్టులు భర్తీ చేయాలి : గంగరాజు
అనంతగిరి:మండలంలోని గురువారం ఎగువ సోభ పంచాయతీ పరీ జాముగుడ గ్రామంలో సిపిఎం ప్రచార భేరి చేపట్టారు. అధిక ధరలు తగ్గించి, స్పెషల్ డిఎస్పీ ద్వారా పోస్టులు భర్తీ చేయాలని సీపీఎం జెడ్పీటీసీ గంగరాజు డిమాండ్ డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ చేపట్టారు. కేంద్రంలో మోడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీ గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టోకూరు సర్పంచ్ కిల్లో మోస్య, పార్టీ కార్యకర్తలు నరాజీ, సురేష్ పాల్గొన్నారు
ఉత్సాహంగా గ్రామాలకు..
పాడేరు: జిల్లాలోని అన్ని మండలాల్లోనూ సంతల్లోనూ ప్రజల నుంచి సంతకాల సేకరణ నిర్వహించారు. జీవో 3 రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ధరలను నియంత్రించాలని, ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని, పెంచిన విద్యుత్ చార్జీలను, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు న్యాయం చేయాలని, హైడ్రో పవర్ ప్రాజెక్టుల అనుమతుల కోసం చేసిన తీర్మానాలను రద్దు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. పాడేరు మండలంలోని గుర్ర గరువు గ్రామంలో సిపిఎం సమరభేరిలో పార్టీ నాయకులు పాలికి లక్కు, ఎల్ సుందర రావు తదితరులు పాల్గొన్నారు.
సంతకాల సేకరణ
పాడేరు: వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయాలని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ చెరువుల వనంలో సంతకాల సేకరణ, గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాంగి ధనుంజరు, మండల కమిటి సభ్యులు మర్రి నాగేంద్రబాబు, సత్తిబాబు, చంటిబాబు, లక్ష్మణరావు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం మండలంలోని అరకు సంత బయలు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఎస్‌బి పోతురాజు మాట్లాడుతూ, జీవో 3కు చట్టబద్ధత కల్పించి ఆదివాసి స్పెషల్ డిఎస్సి వెంటనే విడుదల చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఆ పార్టీ మండల నాయకులు పి.సురేష్ కుమార్, పి సత్యనారాయణ, పి.డుంబు, పి.మోహన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.
పెదబయలు: మండలంలోని అడుగులు పుట్టు పంచాయితీ సంపంగిపుట్టు, తోరంగుల్ గ్రామాల్లో సిపిఎం సమర బేరి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ సభ్యులు బోండా సన్నిబాబు, నాయకులు ధర్మన్నప్పడాల్ మాట్లాడుతూ, ఈనెల 4 వరకు వివిధ రూపాల్లో సిపిఎం నిర్వహిస్తున్న పోరాటాల కు ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బొండా గంగాధరం, జె. సునీల్ కుమార్, గిరిజనులు పాల్గొన్నారు.
కొయ్యూరు:సిపిఎం సమరభేరి కార్యక్రమంలో భాగంగా కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ పరిధి జోడిమామిడి, నిమ్మలపాలెం, తులబడ గ్రామాల్లో సిపిఎం నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వై.అప్పలనాయుడు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం డౌనూరు శాఖ కార్యదర్శి టి.చిట్టిబాబు, నాయకులు టి.ప్రసాదు, అప్పారావు, పౌలు మల్లేశ్వరరావు, ప్రవీణ్, నవీన్ నాయుడు, బాబ్జి, జాను తదితరులు పాల్గొన్నారు.
విఆర్.పురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం నాయకులు మండలంలోని రాజుపేట, రేఖపల్లి, జీడిగుప్ప పంచాయితీలోని గురువారం కరపత్రాలు పంపిణీ చేసి, సంతకాల సేకరణ చేపట్టారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల రైతుల పొలాలు బీడులుగా మారాయని, చేయడానికి పనులు లేక చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం మండల నాయకులు పంకు సత్తిబాబు, గూటాల శ్రీను, సోడి మల్లయ్య, చంద్రరావు, ప్రకాష్, కదల కొండారెడ్డి, ఖాదర్ పాల్గొన్నారు. మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో సిపిఎం నాయకులు, స్థానిక సర్పంచ్ పులి సంతోష్‌కుమార్ ఆధ్వర్యాన ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు గుండిపూడి లక్ష్మణరావు, తుమ్మలపల్లి నాగేశ్వర్రావు, ఆత్మకూరు కాంతారావు, నాళ్ళారపు చందర్రావు, దారోగి బాబురావు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి : నిరుద్యోగం, అధిక ధరలు, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా రాజవొమ్మంగిలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కొండ్ల సూరిబాబు, పి.రామరాజు, టి.శ్రీను మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై జరుగు పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.










