ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తే పతనం తప్పదు- ఫ్యాప్టో జిల్లా చైర్మన్ మాదన విజయకుమార్
కడప అర్బన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తే పాలకుల పతనం తప్పదని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ మాదన విజయకుమార్ హెచ్చరించారు. శనివారం ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం, ఉపాధా ్యయుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పాలకవర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి, ఉద్యోగ ఉపాధ్యాయుల అండదండలతో అధికారంలోకి వచ్చిన పాలకవర్గాలు ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరించడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రభుత్వ విద్యా రంగ నిర్వహణ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసే సాకుతో జిఒ 117 అమలు చేసి ప్రాథమిక విద్యకు పాడెకట్టేందుకు ప్రయత్ని స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటర్ పరిధిలోని ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులను విలీనం చేసి ప్రాథమిక పాఠశాలలను అస్తవ్యస్తంగా మార్చివేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోపే రద్దు చేస్తామన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం నేటికీ కొనసాగుతున్నదన్నారు. సిపిఎస్ స్థానంలో జిపిఎస్‌ను అమలు చేస్తామని ప్రకటించి మరో మారు ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
ఫ్యాప్టో రాష్ట్ర నాయకులు ఎం.రఘునాథరెడ్డి, బి.లక్ష్మీరాజా, ఎ.శ్యాం సుందర్‌రెడ్డి, ఎస్.ఇక్బాల్, ఆర్.అబ్దుల్లా మాట్లా డుతూ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోకపోతే తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కక్షపూరితంగా వ్యవహ రిస్తుందని ఆరోపించారు. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పాఠశాలల సందర్శన పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారని విమ ర్శించారు. చిన్నచిన్న కారణాలను సాకుగా చూపి ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులివ్వడం, సస్పెన్షన్లు చేయడం తగదన్నారు. ప్రవీణ్ ప్రకాష్‌ను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఆర్‌సి, డిఎ బకాయిలను చెల్లించకపోవడం దారు ణమన్నారు. జులై ఒకటో తేదీ నుండి 12వ పిఆర్‌సిని అమలు చేయాల్సి ఉండగా, కమిషన్‌ను నియమించి చేతులు దులుపుకున్నారే తప్ప విధి విధానాలు రూపొందించి అమలు చేయడం లేదని విమర్శించారు. గత పిఆర్‌సి కమిషన్ ఇచ్చిన రిపోర్టును అమలు చేయకుండా దాచి ఉంచిన ప్రభుత్వం, ఇప్పుడు నూతనంగా కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల ఒరిగేదేముండదన్నారు. శాస్త్ర, సాంకేతికత అభివద్ధి చెందిన తరుణంలో నేరుగా పిఆర్‌సిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు మధ్యంతర భతిని ప్రకటిం చాలన్నారు. బదిలీ, పదోన్నతి పొందిన ఉపాధ్యా యులకు రెండు మాసాలుగా వేతనాలు చెల్లించ కపోవడం తగదన్నారు. తక్షణం ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, ఎపిజిఎల్‌ఐ మొత్తాలను ప్రభుత్వం తమ అవసరాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రావిడెంట్ ఫండ్, ఎపిజిఎల్‌ఐ రుణాల కొరకు, అంతిమ చెల్లింపుల కొరకు దరఖాస్తు చేసుకొని సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు చర్యలు తీసుకోవడంతోపాటు, ఉపాధ్యా యుల సమస్యలపై సంఘాలతో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఫ్యాప్టో ట్రెజరర్ వై.వెంకటసుబ్బయ్య, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు, ఎస్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఇలియాస్ భాష, జిల్లా అధ్యక్షులు పి.రమణారెడ్డి, ఎపిటిఎఫ్‌్(257) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.భాస్కర్ రెడ్డి, నాగరాజు, బిటిఎ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఆర్.హరి కొండయ్య, జ్యోతి రామచంద్ర బాబు, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు రాజశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్ యాదవ్ నాయకులు వై.రవికుమార్, కె.నరసింహారావు, సంగమేశ్వర్‌రెడ్డి, శివారెడ్డి, కె.గోవిందు పాల్గొనారు.










