కడప ప్రతినిధి : ఉద్యోగులు తమ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిం చాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలను, ఏడుగురికి ప్రమోషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ అనుబంధ విభాగాల్లో ఉద్యో గులుగా విధులు నిర్వహిస్తూ దురదృష్టవశాత్తూ మృతి చెందిన వారి కుటుంబాల్లో సంతోషం నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మర ణించిన వారి పిల్లలకు కారుణ్య నియామకాల కింద అనిల్‌కుమార్ యాదవ్, నాగేంద్రకుమార్‌నాయక్, పి.సుజాతలకు ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. ఇదేతరహాలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.రామ్‌ప్రతాప్, బి.గుర్రప్ప, వి.చంద్రకళ, ఎస్.కరీముల్లా, ఒ.శారదమ్మ, పి.శంకర్, బి.రఘు నాథరెడ్డిలకు ఉద్యోగోన్నతులు కల్పిస్తూ పత్రాలను అందజేస్తు న్నామని చెప్పారు. జిల్లా పరిషత్ ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని చెప్పారు. అనంతరం పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో లంకా మల్లేశ్వరరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, నాగిరెడ్డి, చంద్ర, పలువురు ఉద్యోగులు గజమాలతో జిల్లా పరిషత్ చైర్మన్‌ను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఃఒ వెంకటరమణారెడ్డి, ఎఒ రంగాచార్యులు, పలువురు ఉద్యోగులు, జడ్‌పిటిసిలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.










