Oct 02,2023 00:13

ఆక్రమణ నుంచి రక్షించాలి..

ఉద్యమానికి చిహ్నం బొడ్డు చౌక

ఆక్రమణ నుంచి రక్షించాలి..
ప్రజాశక్తి - గూడూరు రూరల్‌ : గూడూరు అది క్విట్‌ ఇండి యా ఉద్యమం జోరుగా సాగు తున్న సమయం.. స్వాతంత్య్ర సమర యోధు లు, జాతి పిత మహాత్మగాంధీ ఉద్య మంలో భాగంగా గూడూరుకు చేరుకున్నారు. పాత గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్డు (జీఎన్‌) మార్గంలో ఉద్యమం చేసే క్రమంలో అప్పుడు గూడూరు గ్రామంగా ఉన్న తరుణంలో ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి దేశభక్తులు, ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అక్కడే గాంధీ దీపం వెలిగించి ,ఆ వెలుతురులోనే మాట్లాడారు. అక్కడే విశ్రమిం చారు. అప్పటి నుంచి అప్రాంతాన్ని కి అప్పుడే గాంధీ మండపం 'బొడ్డుచౌకగా నామకరణం చేశారు. ఆ ప్రదేశంలో గాంధీకి గుర్తుగా మండపం నిర్మించారు. ఇదంతా సుమారు 100 ఏళ్ల క్రితం సంగతి. అప్పట్లో ఏ సమావేశం, చర్చ సదస్సు జరగాలన్నా ఆ ప్రాంతంలోనే నిర్వహించే వారు. ఈ మండపం వద్ద గూడూరు గ్రామ, పంచాయతీ, పుర పాలక సంఘం ఏర్పాటు వరకు జమాబందీ చేసేవారు. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు ఆక్రమణ దారులు పట్టపగలే ఆక్ర మించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి అక్రమాదారులపై చర్యలు తీసుకోవాలని గూడూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు.