Apr 30,2023 01:42
లూకయ్యకు నివాళి అర్పిస్తున్న సిపిఎం నాయకులు వై సిద్ధయ్య, జాలా అంజయ్య, సిహెచ్‌ గంగయ్య తదితరులు

ప్రజాశక్తి-చీరాల: ఉపాధ్యాయ ఉద్యమ నేత, కెవిపిఎస్‌ నాయకులు గుర్రం జాషువా సాహితీ సమితి వ్యవస్థాపకులు కామ్రేడ్‌ పంది లూకయ్య(78) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందిన సంగటి పాఠకులకు తెలిసిందే.
- లూకయ్య ప్రస్థానం ఇలా..
ఇంకొల్లు మండలం భీమవరం గ్రామంలో పంది పురుషోత్తం, ఎస్తేరమ్మ దంపతులకు 1945లో డిసెంబర్‌ 15న జన్మించిన పి లూకయ్య బీఎస్సీ బీఈడీ చదివి పేరాల హైస్కూల్లో ఇంగ్లీషు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఉపాధ్యాయ సమస్యలపై యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శిగా అనేక ఉద్యమాలలో పాల్గొనటమే కాకుండా సిపిఎం జీవిత కాలం సభ్యునిగా అనేక సామాజిక పోరాటాలలో పాల్గొన్నా రు. 1972లో ఎస్‌డి కరుణ కుమారిని వివాహం చేసుకొన్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. 1982 చర్చి కాంపౌండ్‌లోని లూథరన్‌ కాలేజీలో వైస్‌ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. కళా సాహిత్య రంగాలలో ఎంతో మక్కువతో సేవ చేస్తూ 2013 అభినవ జాషువా బిరుదును ఆయన పొందారు. ఉపాధ్యాయ సామాజిక సమస్యలపై ఎంతో అవగాహన కలిగిఉండేవారు. ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేసినప్పటికీ గుర్రం జాషువా సాహితీ సమితిని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమా లను స్వచ్ఛందంగా నిర్వహించారు. తన 78 సంవత్సరాల వయసులోనూ ఎమ్మెల్సీ ఎన్నికలలో చివరిసారిగా తన ఉపాధ్యాయ ఓటు హక్కును వీల్‌ చైర్‌లో వచ్చి మరీ వినియోగించుకున్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసు కుంటున్న ఆయన మృతి చెందడంతో ఉపాధ్యాయ రంగంతో పాటు ఉద్యమ రంగనాయకులు తీరని లోటుగా భావిస్తూ కన్నీటితో వీడ్కోలు ఘటించారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అంత్యక్రియలలో సిపిఎం రాష్ట్ర నాయకులు వై సిద్దయ్య, జాల అంజయ్య పాల్గొని మృతదేహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ అమృతపాణి కూడా లూకయ్యకు నివాళులర్పించారు. ఈ అంత్యక్రియలలో సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య, నాయకు లు నలతోటి బాబూరావు, పి కొండయ్య, బి సుబ్బారావు, వసంతరావు, జయరాజు, పలు ప్రజా సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు, ఆత్మీయులు పాల్గొన్నారు.