ప్రజాశక్తి-మార్టూరు రూరల్: ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు దాచూరి రామిరెడ్డి ప్రతి ఉపాధ్యాయుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని యూటీఎఫ్ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం యూటీఎఫ్ మార్టూరు శాఖ అధ్యక్ష కార్యదర్శులు బండారు ఆదినారాయణ, పోపూరి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు దాచూరి రామిరెడ్డి వర్థంతిని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ బాపట్ల జిల్లా కార్యదర్శి కందిమళ్ల రవిబాబు, గరిమిడి శ్రీనివాసరావు, వేణు, కట్ట రంగస్వామి, షేక్ మౌలాలి, సూర్యప్రకాష్, షేక్ షబ్బీర్, నారాయణరెడ్డి, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ రెడ్డి, డాక్టర్ భవాని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మేదరమెట్ల: యుటిఎఫ్ వ్యవస్థాపకులు, శాసనమండలి మాజీ సభ్యులు, దివంగత దాచూరి రామిరెడ్డి ఏడో వర్థంతి కార్యక్రమాన్ని మేదరమెట్లలో మంగళవారం యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు పి హరిబాబు మాట్లాడుతూ రామిరెడ్డి యుటిఎఫ్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండలకార్యదర్శి కంచర్ల పోతురాజు, వెంకటేశ్వరరెడ్డి, ఓ శ్రీనివాసరావు, బొనిగల శ్రీనివాసరావు, భక్తరాజ్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.










