ఉదయగిరి జిల్లా సాధనకు సహకరించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : జయహో ఉదయగిరి జిల్లా కావాలని నినాదాన్ని దాసరిపల్లి వాసులతో జిల్లా సాధన కమిటీ అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్ మారుమోగించారు. బుధవారం మండల పరిధిలోని దాసరపల్లి గ్రామంలో పల్లెల్లో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరిని జిల్లా చెయ్యాలని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని అందుకు మెట్ట మండలాల ప్రజలు సహకరించాలన్నారు. 8 మండలాలలో ప్రజలను చైతన్య పరిచే దిశగా జిల్లా సాధన కమిటీ కార్యక్రమం రూపొందించి ఈ అవగాహన కార్యక్రమంతో ప్రజలకు జిల్లా ఆవశ్యకతను వివరిస్తున్నామన్నారు. జిల్లా సాధనతో జరిగే ప్రయోజనాలు మనకు జరిగిన అన్యాయం ఈ ప్రాంత నైసర్గిక స్వరూపాన్ని వివరించి జిల్లా కావాలని డిమాండ్‌ను వారితో జయహో ఉదయగిరి జిల్లా అనిపించి జిల్లా అవసరం ప్రాధాన్యతపై వారి మధ్య చర్చకు తెరలేపారు. అనంతరం జిల్లా ఉద్యమ నాయకులు షేక్ దస్తగిరి అహ్మద్, షేక్ ఖాదర్ బాషా వారిదైన శైలిలో జిల్లా ప్రాధాన్యతను చాటారు. కార్యక్రమంలో ఎం.పి.టి.సి. షేక్ సుభాన్, సర్పంచ్ షేక్ గౌస్ మొహిద్దీన్, జాఫర్ మొహిద్దీన్, వెంగళరెడ్డి, షేక్ అలిజాన్, విశ్రాంత ఉపాధ్యాయులు రమణయ్య, ఓబుల్ రెడ్డి, రమణయ్య పాల్గొని తమ మద్దతు తెలిపారు.










